నేను క్యారక్టర్ ఆర్టిస్ట్ ను కాదు. హీరోయిన్ గా గుర్తించండి అంటూ అర్చన వాపోతుంది. దీనంతటికి కారణాలున్నాయని గతంలో జరిగిన అనుభవాల్ని ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కెరియర్ ప్రారంభం లో మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. అలా తాను తీసుకున్న నిర్ణయం వల్లే తన కెరియర్ బాగలేదని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
సినిమాల్లో యాక్ట్ చేస్తున్నా హీరోయిన్నా, కేరక్టర్ ఆర్టిస్టా అనే డైలామాలో ఉన్నానని దానంతటికి కారణం నువ్వుస్తానంటే నేనొద్దంటానా సినిమా అని ఆవేదన వ్యక్తంచేసింది.
ఆ సినిమాలో తాను సెంకెండ్ హీరోయిన్ గా సెలక్ట్ చేసుకొని సినిమా ప్రారంభమైన తరువాత తనని క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మమ అనిపించారని ..ఆ సినిమా చేయకపోతే కెరియర్ బాగుండేదని చెప్పుకొచ్చింది. వెండితెరపై వెలిగిపోవాలంటే ఆత్మాభిమానాన్ని వదులుకోవాలి. లేదంటే బ్యాగ్రౌండ్ అన్నా ఉండాలి. నాకు ఆత్మాభిమానం ఉంది. బ్యాగ్రౌండ్ ఎవరు లేరు. కాబట్టే నేను ఇలా ఉన్నా. సరైన మేనేజర్ , వెల్ విషర్ లేకపోవడంతో ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేసి కెరియర్ పరంగా దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చింది అర్చన