సైరాతో మెగస్టార్ చిరంజీవికి మరో షాక్ తగలనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాదాపు 10ఏళ్ల విరామం తరువాత ఖైదీ నెంబర్ 150తో హిట్ కొట్టిన చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా గురించి వచ్చిన ఓ వార్త హాట్ టాపిగ్గా మారింది.
ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరో అమితాబ్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారనే వార్త ఫిల్మింనగర్ లో చక్కెర్లు కొడుతుంది. కానీ ఆ వార్తల్లో నిజంలేదని ఆ చిత్ర నిర్మాణానికి సంబంధించిన డిజిటల్ పీఆర్వో ఖండించారు. అమితాబ్ తప్పుకోలేదని, రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటార ని స్పష్టం చేశారు.
ఇప్పటికే సైరాకు అనేక ఇబ్బందులు తలెత్తాయి. మొదట మ్యూజిక్ డైరక్టర్ ఏ ఆర్ రెహమాన్, ఆ తరువాత సినిమాటోగ్రాఫర్ తొలగడంపై తాజాగా అమితా తప్పుకున్నరానే వార్తలు నిజమేనని నమ్ముతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఫ్రిబ్రవరి వరకు ఆగాల్సిందే.