సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రమాణ స్వీకార ఆడియోను చిత్ర బృందం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు విడుదల చేసింది. ఆడియోలో..మహేష్ బాబు ' భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాకర్తవ్యాలను శ్రద్దతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగా కాని, పక్షపాతంగా కాని, రాగద్వేశాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అంటూ అభిమానులను అలరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మహేష్ బాబు ఏపీ సీఎం గా ఫస్టాఫ్ ఇంటర్వెల్ లో ఎంట్రి ఇస్తాడంట. అప్పటి వరకు శరత్ కుమార్ పాలిటిక్స్ లో తనదైన శైలిలో దూసుకుపోతుంటే మహేష్ బాబు మాత్రం హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగే నేపథ్యంలో కథ ఫస్టాఫ్ ముగుస్తుందంట. ఇక ఫస్టాఫ్ ఎండింగ్ లో అన్వేక కారణాలతో పాలిటిక్స్ లో ఎంటరైన మహేష్ బాబు సెకెండ్ ఆఫ్ లో అనేక రాజకీయ ఎత్తుగడలు, ప్రత్యర్ధి కుట్రల్ని చిత్తు చేస్తూ ప్రజా సమస్యల్ని పరిష్కారిస్తూ విలన్ల వెన్నుపోటు రాజకీయాలనుంచి తప్పించుకునే ప్రయత్నాలు ఉంటాయని టాక్. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించి మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. మరి భరత్ అను నేను లో ప్రిన్స్ సీఎం గా ఎలా కనువిందు చేస్తాడో తెలియాలంటే ఏప్రిల్ దాకా ఆగాల్సిందే.