హిందీలో పద్మావత్ , తెలుగులో భాగమతి. ఈ రెండు సినిమాలో హీరోయిన్ లీడ్ రోల్ గా తెరకెక్కడంతో అంచనాలు భారీగా పెరిగాయనే చెప్పుకోవాలి. బాహుబలి గ్యాప్ లో సైజ్ జీరోలో భారీగా బరువు పెరిగిన అనుష్క అందర్ని ఆశ్చర్యంలో ముచ్చెంత్తింది. సైజ్ జీరో తరువాత బాహుబలి-2 కోసం యధావిధిగా వచ్చేందుకు బాగానే కష్టపడింది. ఆమె కష్టానికి ప్రతిఫలంగా ఆ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందో మనందరికి తెలిసిందే. అయితే తాజాగా అనుష్క అశోక్ కుమార్ డైరక్షన్ లో విడుదలైన భాగమతి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
ఈ సినిమా తొలిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. దేశ వ్యాప్తంగా 1200థియేటర్లలో విడుదలైంది. ఓవర్సీస్ లో అమెరికాలో 1,56, 538 డాలర్లు వసూలు చేసింది. కేవలం తొలి వీకెండ్ లోనే ఈ సినిమా 12.14 కోట్ల రూపాయలను.. షేర్ రూపంలో తెలుగు రాష్ట్రాల నుంచే సాధించింది. ఫిమేల్ లీడ్ మూవీస్ లో ఇదే ఇప్పటివరకూ అతి పెద్ద టాలీవుడ్ రికార్డ్ గా చెప్పవచ్చు.
దీపిక పద్మావత్ నుంచి పోటీ ఉంటుందని ఆశించినా.. అంతగా ప్రభావం చూపలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లోను .. ఓవర్సీస్ లోను కలుపుకుని, తొలివారంతంలో ఈ సినిమా 36 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిందని చెబుతున్నారు.
వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కంటిన్యూ చేస్తుండటం విశేషం. తెలుగు .. తమిళ.. మలయాళ .. ఓవర్సీస్ వసూళ్లను కలుపుకుంటే, తొలివారం ముగిసేనాటికీ ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.