టాలీవుడ్ లో 2018 మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ ను మొదట అనుష్క అందుకుందనే చెప్పాలి. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులకు భాగమతి సంతృప్తి పరచిందనేది ప్రస్తుతం టాలీవుడ్ నడుస్తున్న హాట్ టాపిక్. అంతే కాకుండా ఇటు నిర్మాతలకు అటు బయ్యర్లకు సినిమా మంచి లాభాలను అందించింది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాలో అనుష్క నటన బాగా క్లిక్ అయ్యింది. అందుకు తగ్గట్టు బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ కూడా హర్రర్ స్పెషలిస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
అయితే సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా చూశారు. కొందరైతే స్పెషల్ షో వేసుకొని మరి చూశారు. ఇక రీసెంట్ గా రామచరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి గురువారం రాత్రి ‘భాగమతి’ సినిమా చూశారట. ఈ విషయాన్ని చరణ్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడిస్తూ తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘నిన్న రాత్రి నేను, ఉపాసన ‘భాగమతి’ సినిమా చూశాం. మైండ్ బ్లోయింగ్. చిత్రంలోని ప్రతి ఒక్కరూ చాలా బాగా పనిచేశారు. కంగ్రాట్స్. ‘భాగమతి’ చూసి మా ఆవిడకు రాత్రంతా నిద్రపట్టలేదు’ అంటూ సరదాగా పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే భాగమతి కలెక్షన్ల పరంగా చూసుకుంటే సినిమా విడుదలైన తొలివారంలో కలెక్షన్లు ఉదృతంగా లేకపోయినా ..స్టడీగా కలెక్షన్లు వసూలవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారం వరకు ఇవే వసూళ్లు కొనసాగితే టేబుల్ ఫ్రాఫిట్ కాకుండా పెద్ద హీరో సినిమాలకు కలెక్షన్లు వచ్చినట్లు ఈ సినిమా కూడా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సంక్రాతి సీజన్ లో పెద్ద సినిమాలతో పోటాపోటీగా వచ్చిన ఈ సినిమా 52 కోట్ల గ్రాస్ తో 28 కోట్ల షేర్ రాబట్టింది.
నైజాంలో 10.5 కోట్లు, ఆంధ్ర నుంచి 11.7 కోట్ల గ్రాస్ తో 7.5 కోట్ల షేర్, 3 కోట్ల 30 లక్షల గ్రాస్ తో 2 కోట్ల 20 లక్షల షేర్ తో పర్వాలేదు అనిపించుకుంది. ఇక తమిళంలో 3 కోట్ల 60 లక్షల దాకా షేర్ తెచ్చింది. ఓవర్సీస్ లో 5.5 కోట్ల గ్రాస్ తో 2.5 కోట్ల షేర్ తో బాగానే రాబట్టింది.