మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం ఆయన తన కారులో ఒంగోలు నుంచి త్రోవగుంటకు వెళ్లే రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. త్రోవగుంటకు వచ్చేసరికి కారు టైరు పేలిపోయింది. దీంతో, అదుపు తప్పిన కారు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. కాగా... అదే సమయంలో అటుగా మోటార్ సైకిల్‌పై వెళుతున్న మార్నేని ఆంజనేయులు అనే వ్యక్తికి కారు ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.