అడిలైడ్ టెస్టులో టీమిండియా 307 పరుగులకి ఆలౌటైంది. ఆస్ట్రేలియా ముందు 323 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లంచ్ కు ముందువరకు నిలకడగా ఆడిన టీమిండియా 50 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లను చేజార్చుకుంది. 151/3 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన మరో 156 పరుగులు జోడించి మిగతా వికెట్లు కోల్పోయింది. పుజారా(71), రహానే(70) ఆసీస్ బౌలర్లను ఎదురొడ్డి నిలిచినప్పటికీ మిగతా బ్యాట్స్‌మన్ నుంచి సహకారం లేకపోవడంతో టీమిండియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాహుల్(44), కోహ్లి(34), పంత్(28) భారీ స్కోరు చేయలేకపోయారు. రోహిత్ శర్మ(1) విఫలమయ్యాడు. మొత్తంగా 142 ఓవర్లలో భారత బౌలర్లు విజృంభించి ఆస్ట్రేలియాని త్వరగా ఔట్ చేస్తే ప్రతిష్టాత్మక విజయం భారత్ ఖాతాలో చేరుతుంది.