అత్తింటి ఆరళ్ళకు బలైన మౌనిక

Update: 2018-12-25 14:18 GMT

అత్తింటి ఆరళ్ళకు ఓ అబల బలైంది. అత్తమామలు, మరిది కలిసి ముక్కుపచ్చలారని కోడలిని నిప్పంటించి కడతేర్చారు. కోటి ఆశలతో మెట్టినింటికి చేరి మూడునెలలు తిరగకముందే తనువు చాలించింది పూర్తిగా కాలిన శరీరంతో నాలుగురోజులుగా మృత్యువుతో పోరాడి విగతజీవిగా మారింది. హృదయవిదారకమైన ఈ ఘటన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని కొరిడీ గ్రామంలో జరిగింది. కొరిడీ గ్రామానికి చెందిన ఒట్టి రవికుమార్ కి దొరవారిసత్రం కారికేడు గ్రామానికి చెందిన మౌనికను ఇచ్చి నాలుగునెలలు క్రితం వివాహం చేశారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వివాహాన్ని ఘనంగా జరిపారు. మౌనిక తల్లిదండ్రులు. భారీగా కట్నకానుకలు,స్థోమతకు మించి లాంఛనాలతో మెట్టింటికి సాగనంపారు మౌనిక తల్లిదండ్రులు.

కొన్నాళ్లు సంతోషంగా ఉన్న ఆకుటుంభంలో మౌనిక మరిది విలన్ గా మారాడు. వదినపై ఆబండాలు వేయడం తల్లిదండ్రుల ద్వారా ఆరళ్లు పెట్టించడం మొదలు పెట్టారు. షార్ లో కాంట్రాక్టు పనులు చేసుకుంటూ రోజంతా అక్కడే ఉండే మౌనిక భర్త రవికుమార్ కి పెద్దగా తెలిసేవి కావు అప్పుడప్పుడు మౌనిక చెప్పిన భర్త పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఈ నేపధ్యంలో గత 15 క్రితం అత్త,మామ, మరిది కలిసి భర్త రవికుమార్ఇంట్లో లేనిసమయంలో మౌనికకు నిప్పంటించారు తీవ్రంగా గాయపడ్డ మౌనికను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మూడువంతులు శరీరం కాలిపోవడంతో 15 రోజులు మృత్యువు తో పోరాడిన మౌనిక గతరాత్రి తనువు చాలించింది. అత్త,మామ, మరిది చేతిలో తీవ్రంగా గాయపడిన మౌనిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో తన చావుకు కారణాలు వివరించింది. అత్తమామలు మరిది ప్రసన్న కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పింది.

Similar News