ప్రకాశం జిల్లా టీడీపీ నేతలపై చంద్రబాబు సీరియస్

Update: 2018-11-03 04:56 GMT

రెండ్రోజుల ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు పార్టీలో సమస్యలపై దృష్టి పెట్టారు. టీడీపీలో సమస్యాత్మకంగా మారిన యర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాలపై ఒంగోలులో రాత్రంతా సమీక్ష చేశారు. ఈ సమావేశం అర్థరాత్రి 2 గంటల వరకు సాగింది. అయితే యర్రగొండపాలెం నియోజకవర్గ సమక్షలో చంద్రబాబు స్థానిక నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి గంటకు పైగా సాగిన సమీక్షలో యర్రగొండపాలెం నేతలు తీరు మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరికలు చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజుపై సీరియస్ అయిన చంద్రబాబు పద్ధతి మార్చోకోవాలని ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రయోజనాల కోసం దశాబ్దాల వైరం మరచి టీడీపీ కాంగ్రెస్‌తో చేతులు కలపలేదా అని  చంద్రబాబు ప్రశ్నించారు. అలాంటిది టీడీపీ ప్రయోజనాల కోసం జిల్లా నేతలు చిన్న చిన్న గొడవలు మరచిపోలేరా అని నిలదీశారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం కొండపి, మార్కాపురం నియోజకర్గాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.

Similar News