గవర్నర్ నరసింహన్‌తో ఏపీ బీజేపీ నేతల భేటీ ముగిసింది. ఏపీ సర్కార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు పీడీ అకౌంట్స్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పీడీ అకౌంట్స్ తెరిచారని, 53వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని చెప్పారు. పీడీ అకౌంట్స్‌పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో సహా అందరూ అబద్దాలు చెబుతున్నారని, సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణకు సిద్ధపడాలని సూచించారు. మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లను రద్దు చేసి కొత్త స్కామ్‌కు ప్రభుత్వం తెరతీసిందని, టెండర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు పాల్గొనకూడదని బీజేపీ నేతలు ప్రశ్నించారు.