వరుస సినిమాల విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న అనుష్క భాగమతిగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నట్లు టాక్. హీరో లేకుండా లీడ్ రోల్ ప్లే చేసిన అనుష్క తన పెర్ఫామెన్స్ తో సినిమాను రక్తికట్టించింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు చతికిలపడడం, రీసెంట్ గా వచ్చిన పద్మావత్ కు నిరసనల సెగ తగలడంతో ప్రేక్షకులు భాగమతివైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు అరుంధతి తరహాలో ఉంటుందనే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నిర్మాణ సంస్థ యువి క్రియేషన్ ప్రమోషన్ బాగా చేసింది. ఇక సినిమా ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో ఒక్కటే 2 కోట్ల షేర్ ఇచ్చిన భాగీ సీడెడ్ లో 70 లక్షలతో పర్వాలేదు అనిపించుకుంది.
ఉత్తరాంధ్ర నుంచి 60 లక్షలు, గుంటూర్ 50 లక్షలు, గోదావరి జిల్లాలు కలిపి 70 లక్షలు, కృష్ణా 40 లక్షలు, నెల్లూరు 30 లక్షలతో సుమారు 5 కోట్ల 20 లక్షలు షేర్ రూపంలో తన ఖాతాలో వేసుకున్నట్లు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద హీరో సైతం ఇంత ఓపెనింగ్ రాకపోవడండ విశేషం. భాగమతి ఇలా వారందాకా తన వసూళ్ల పరంపర కొనసాగిస్తే బ్లాక్ బ్లాస్టర్ అవ్వడం ఖాయమని ప్రేక్షకుల అంచనా