ఆంధ్ర యునివర్శిటీలో ఓక బల్లి కలకలం రేపుతుంది. దీంతో విద్యార్థులు మెస్ యాజమాన్యానికి వ్యతిరేఖంగా నిరసనలు చేపట్టారు. యునివర్శిటికి చెందిన సైన్స్ విద్యార్థుల మెస్‌లో రసంలో వచ్చిన బల్లి అదృష్టవశాత్తు కంట పడటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఒక వేళ బల్లిని గుర్తించడంలో ఏ మాత్రం ఆలస్యం జరిగిన, అది తిన్న విద్యార్థులు తీవ్రమైన అస్వస్థకు గురయ్యే వారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇంతకు ముందు కూడా పలుసార్లు ఇలా జరిగిందని, అప్పట్లో చిన్న చిన్న పురుగులు, ఈగలు వచ్చేవని ఇప్పుడు ఏకంగా బల్లి వచ్చిందని ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదని, పొరపాటున ఆందోళన చేస్తే ఎక్కడ మార్కులు కట్ చేస్తారో అని భయపడే వారమని, కాని ఇప్పుడు బల్లి రావడంతో మార్కుల కంటే ఆరోగ్యం ముఖ్యం అని ఇలా ఆందోళనకు దిగక తప్పలేదని మీడియాకు చెప్పారు.