ఏపీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం జరిగింది. పాలు, పూలతో కేసీఆర్ కు యాదవ యువభేరీ ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. తెలంగాణలో రాజ్యసభ సీటు యాదవ కులస్తులకే కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇలా పాలాభిషేకం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాదవులకు తగిన గౌరవం, గుర్తింపు దక్కలేదని ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం యాదవులకు ఇస్తున్న గౌరవాన్ని వారు ప్రశంసించారు. ఏపీలోని 13 జిల్లాల్లో కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తామని యాదవ యువభేరీ నేతలు తెలిపారు.