ఏపీలో బీజేపీ నుంచి నేతల వలసలకు హైకమాండ్ బ్రేక్ వేసింది. అమిత్ షా ఫోన్ కాల్‌తో.. వైసీపీలో చేరాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణ మనసు మార్చుకున్నారు. బీజేపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ నేతలను వైసీపీలో చేర్చుకోవద్దని.. జగన్‌కు అమిత్ షా మెసేజ్ పెట్టారు. వాస్తవానికి.. కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇంతలోనే.. ఢిల్లీ నుంచి అమిత్ షా.. ఒక్క ఫోన్ కాల్‌తో అంతా సెట్ చేసేశారు. దీంతో.. వైసీపీలో చేరకుండా ఉండేందుకు.. కన్నా లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో చేరారని ప్రచారం జరుగుతోంది.