అండమాన్, నికోబర్ దీవుల్లో ఓ అమెరికాకు చెందిన జాన్ అలెన్ అనే టూరిస్టును గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అతడు పలుమార్లు ఇండియాకు వచ్చాడు. ఈ క్రమంలో వారంరోజుల కిందటే అండమాన్, నికోబర్ దీవులకు వచ్చాడు. ఈ క్రమంలో ఉత్తర సెంటినెల్ ద్వీపంలోని గిరిజనులకు క్రైస్తవ బోధనలను చేసేవాడని స్ధానిక మీడియా పేర్కొంది. అయితే అతన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇదిలావుంటే జాన్ అలెన్ చిదియతపు ప్రాంతం నుంచి కొందరు మత్స్యకారుల సహకారంతో ఈనెల 16న ఉత్తర సెంటినెల్ ద్వీపానికి చేరుకున్నారు. ఉత్తర సెంటినెల్ ద్వీపంలో నివసించే తెగ బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకునేందుకు ఇష్టపడదని చెబుతున్నారు. కాగా ఈ తెగలో కేవలం 50 మంది జనాభా ఉన్నట్టు సమాచారం.