హీరోయిన్ అమలాపాల్ పై లైంగిక వేధింపులు జరిగాయి. డాన్స్ స్కూల్ యజమాని అయిన అళగేశన్ తనతో అసభ్యంగా, పరుషపదజాలంతో అశ్లీలంగా మాట్లాడని మొరపెట్టుకుంది. అంతేకాదు మలేషియాలో ఉన్న తన ఫ్రెండ్స్ తో డిన్నర్ కి వెళ్లాలని కోరాడని తెలిపింది. ఈ సందర్బంగా తన పై వచ్చిన వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అమలా పాల్ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే అమలాపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఈ లైంగిక వేధింపులు హీరోయిన్లకు కామన్ అయిపోయింది. గతేడాది హీరోయిన్ భావనపై లైంగిక వేధింపులు జరిగిన విషయం తెలిసిందే. 2017, ఫిబ్రవరి 18న ఓ సినిమా షూటింగ్ ముగించుకొని వస్తుండగా రాత్రి 9.30 సమయంలో కొంతమంది దుండగులు ఆమె కారును అడ్డగించారు. నెదుంబసేరీ విమానాశ్రయం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ను పక్కకు తోసేసి భావనను మరో వాహనం లో ఎక్కించుకున్నారు. అనంతరం సిటీ అంతా తిప్పుతు దాదాపు గంటన్నర పాటు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ సమయంలో దుండగులు రాక్షసానందాన్ని పొందుతూ వీడియోలు, ఫోటోలు తీసి పళరివత్తం జంక్షన్ వద్ద వదిలేశారు. ఈ ఘటనతో హతాశురాలైన భావన కోలుకొని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేగింది.