Zomoto: ఇక మీదట జొమాటో పేరుతో ఫుడ్ ఆర్డర్ చేస్తే రాదు.. ఎందుకో తెలుసా ?
Zomoto: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గురించి షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ కంపెనీ పేరు మారబోతుంది.

Zomoto: ఇక మీదట జొమాటో పేరుతో ఫుడ్ ఆర్డర్ చేస్తే రాదు.. ఎందుకో తెలుసా ?
Zomoto: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గురించి షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ కంపెనీ పేరు మారబోతుంది. ఇప్పుడు మీరు జొమాటోలో ఆర్డర్ చేస్తే మీకు ఆహారం డెలివరీ కాదు. ఎందుకంటే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జొమాటో పేరు మార్చడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కంపెనీ పేరు జొమాటోకు బదులుగా ఎటర్నల్ లిమిటెడ్ అవుతుంది. కంపెనీ పేరు మార్చడానికి అనుమతి లభించిందని కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. 20 మార్చి 2025 నుంచి కంపెనీ పేరు మారిపోయింది. మార్చి 20, 2025 నుండి కంపెనీ పేరు “ఎటర్నల్ లిమిటెడ్”గా మారిందని జొమాటో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో గురుగ్రామ్‌కు చెందిన ఈ కంపెనీ తన మాతృ సంస్థ పేరును ఎటర్నల్ లిమిటెడ్‌గా మార్చడానికి వాటాదారుల అనుమతి కోరారు. ఆ కంపెనీ రెండోసారి తనను తాను రీబ్రాండ్ చేసుకుంటోంది. ఇది 2008 లో ఫుడిబే పేరుతో స్థాపించారు. తర్వాత 2010 లో జొమాటో గా పేరు మార్చారు. కొన్ని నెలల క్రితం కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. కంపెనీ వాటాదారులు కంపెనీ నిర్ణయానికి మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నామని అన్నారు. వారు ఆమోదం పొందిన తర్వాత, మా కార్పొరేట్ వెబ్‌సైట్ zomato.com నుండి eternal.com గా మారుతుందని కూడా ఆయన అన్నారు. మేము మా స్టాక్ టిక్కర్‌ను కూడా మారుస్తామని ఆయన తెలిపారు.
పేరు ఎందుకు మార్చబడింది?
జొమాటో తన కంపెనీ బ్లింకిట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. బ్లింకిట్‌ను ప్రారంభించినప్పుడు దానిని కంపెనీ ద్వారా ప్రమోట్ చేశామని దీపిందర్ గోయల్ చెప్పారు. జొమాటో లాంటి కంపెనీ మాకు వచ్చిన తర్వాత దాని పేరును మారుస్తామని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపారు. బ్లింకిట్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.