Cash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్‌ కష్టమే.. ఎందుకంటే..?

Cash Deposit: అక్రమ నగదు లావాదేవీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

Update: 2022-08-09 09:15 GMT

Cash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్‌ కష్టమే.. ఎందుకంటే..?

Cash Deposit: అక్రమ నగదు లావాదేవీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నగదు విత్‌డ్రా పరిమితిని సవరించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేయడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. అంటే ఇప్పుడు మీరు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసేటప్పుడు పాన్ కార్డు, ఆధార్ కార్డును చూపించాలి. అంతే కాదు నిర్ణీత పరిమితికి మించి నగదు చెల్లించినా లేదా నగదు స్వీకరించినా భారీ జరిమానా విధించేలా నిబంధన రూపొందించారు.

కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు బ్యాంకుల్లో రూ. 20 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి పాన్ లేదా ఆధార్‌ను అందించడం తప్పనిసరి చేసింది. మే 10, 2022 న ప్రభుత్వం ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను (15వ సవరణ) రూల్స్, 2022 ప్రకారం కొత్త నిబంధనలను రూపొందించింది. ఈ కొత్త నిబంధనల అమలు తర్వాత ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 20 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ కార్డ్ ఇవ్వడం తప్పనిసరి అయింది.

పాన్‌కార్డు లేని వారు ఒక రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేయలేరు. ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలకి కనీసం ఏడు రోజుల ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 2 లక్షల కంటే ఎక్కువ నగదును స్వీకరించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అందువల్ల ఒక్కరోజులో మీ దగ్గరి బంధువుల నుంచి కూడా రూ.2 లక్షలకు మించి నగదు తీసుకోలేరు.

Tags:    

Similar News