World Bank: ప్రపంచ దేశాలకు వరల్డ్ బ్యాంకు హెచ్చరికలు

World Bank: వడ్డీ రేట్లను పెంచితే ఆర్థిక మాంద్యం తప్పదని వార్నింగ్

Update: 2022-09-16 14:00 GMT

World Bank: ప్రపంచ దేశాలకు వరల్డ్ బ్యాంకు హెచ్చరికలు

World Bank: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తప్పదా? అంటే అవుననే హెచ్చరిస్తోంది ప్రపంచ బ్యాంకు. పెరుగుతున్నధ‌ర‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి వివిధ దేశాల సెంట్ర‌ల్ బ్యాంకులు కీల‌క వ‌డ్డీరేట్లు పెంచేస్తున్నాయి. దీంతో ప్ర‌పంచం దేశాలు ఆర్థిక మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటుంటున్నాయని ప్ర‌పంచ బ్యాంక్‌ వెల్లడించింది. ప్ర‌పంచంలోనే మూడు బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు.. అమెరికా, చైనా, యూరప్‌ల పురోగ‌తి నెమ్మ‌దించింద‌ని వివరించింది. వ‌చ్చే ఏడాది ప్ర‌పంచ ఏకాన‌మీ ఓ మోస్తరు మాంద్యంలో చిక్కుకుంటుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.ఇంత‌కుముందు ఆర్థిక మాంద్యాల కంటే శ‌ర‌వేగంగా ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ వినియోగ‌దారుల నమ్మకాన్ని కోల్పోతుంద‌ని పేర్కొంది.

గ్లోబ‌ల్ గ్రోత్‌రేట్ శ‌ర‌వేగంగా ప‌డిపోతుంద‌ని వివరించింది. గ్లోబ‌ల్ గ్రోత్‌రేట్ మున్ముందు మ‌రింత ప‌డిపోతే ప‌లు దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటాయని ప్ర‌పంచ బ్యాంక్ హెచ్చరించింది. క‌రోనా ముందు నాటి స్థాయికి ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నియంత్రించ‌డానికి ప్ర‌భుత్వ విధాన నిర్ణ‌యాలు స‌రిపోవ‌ని స్ప‌ష్టం చేసింది. స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం, లేబ‌ర్ మార్కెట్‌పై ఒత్తిళ్లు త‌గ్గ‌కుండా ముంద‌డుగు వేయ‌లేమని వెల్ల‌డించింది. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే 2023లో ప్ర‌పంచ ద్ర‌వ్యోల్బ‌ణం రెట్టింపై ఐదు శాతానికి చేరుతుంద‌ని వివరించింది వరల్డ్ బ్యాంక్.

Tags:    

Similar News