Gold Rate Today: ధంతేరాస్ ముందు భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలిస్తే షాక్ అవుతారు
Gold Rate Today: ధంతేరాస్ ముందు పసిడి ప్రియులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈమధ్య భారీగా పెరుగుతున్న బంగారం ధర నేడు సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆదివారం 80,290 ఉండగా సోమవారం 79, 800రూపాయలు పలుకుతోంది.
అంటే బంగారం ఏకంగా తులానికి రూ.490 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఆదివారం 73,600 ఉండగా సోమవారం 73,150 ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాములపై 450 రూపాయల వరకు తగ్గింది.
బంగారం ధర పది గ్రాములపై దాదాపు రూ. 500 తగ్గింది. అయినప్పటికీ అక్టోబర్ నెల ఆరంభానికి ఇప్పటికీ పోల్చినట్లయితే భారీగా పెరిగింది. అక్టోబర్ 1వ తేదీ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 76, 910రూపాయలు ఉంది. అక్టోబర్ 28న 79,800గా ఉంది.
అంటే నెల ఆరంభానికి ఇప్పటికీ 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై 2890 పెరిగింది. ఒక నెలలో బంగారం ధర దాదాపు 3000 రూపాయలు పెరిగే దిశగా వెళ్తోంది. జూన్, జులై నెలల్లో బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది.
ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇలా వరుసగా 3 నెలల నుంచి బంగారం ధర పైపైకి ఎగబాకుతోంది. అక్టోబర్ నెలలో 24క్యారెట్ల బంగారం ధర ఇప్పటి వరకు 3.76 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏడుసార్ల రెసిషన్ వచ్చింది.
ఐదుసార్లు బంగారంలోకి భారీగా పెట్టుబడులు రావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. వెండి ధరల్లో మాత్రం సోమవారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,07,000 రూపాయలు పలుకుతోంది.