22 Carat vs 24 Carat Gold: 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏంటి.. నగలు చేయడానికి ఏది పనికొస్తుంది..!

22 Carat vs 24 Carat Gold: ఇండియాలో బంగారానికి చాలా డిమాండ్‌ ఉంటుంది. ఎందుకంటే పెళ్లితో మొదలుకొని ఏ ఫంక్షన్‌ అయినా సరే బంగారం ఉండాల్సిందే.

Update: 2024-05-15 12:30 GMT

22 Carat vs 24 Carat Gold: 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏంటి.. నగలు చేయడానికి ఏది పనికొస్తుంది..!

22 Carat vs 24 Carat Gold: ఇండియాలో బంగారానికి చాలా డిమాండ్‌ ఉంటుంది. ఎందుకంటే పెళ్లితో మొదలుకొని ఏ ఫంక్షన్‌ అయినా సరే బంగారం ఉండాల్సిందే. సామాన్యులు సైతం వారి బడ్జెట్‌లో ఎంతో కొంత కొనుగోలు చేస్తారు. ఇండియాలో బంగారం అనేది బిజినెస్‌ మాత్రమే కాదు సంప్రదాయం కూడా. అందుకే ఇక్కడి మహిళలు బంగారం అంటే ఎంతో ఇష్టపడుతారు. బంగారంలో ఇన్వెస్ట్‌ చేయడానికి అనేక ఆప్షన్స్‌ ఉన్నాయి. బంగారు బాండ్లు, డిజిటల్‌ గోల్డ్‌, గోల్డ్‌ మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే చాలామందికి 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం మధ్య తేడా తెలియదు. ఈ రెండింటిలో ఏది మంచిది, నగలు చేయించుకోవ డానికి ఏది పనిచేస్తుంది.. తదితర వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.

బంగారాన్ని క్యారెట్లలో కొలుస్తారు. బంగారం ఎంత స్వచ్ఛమైనదో దీన్నిబట్టి తెలుస్తుంది. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛంగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారంలో రూపంలో 99.9 శాతం బంగారం ఉంటుంది. బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటే దాని క్యారెట్ విలువ అంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 24, 22, 18,14 క్యారెట్ల బంగారం మార్కెట్‌లో దొరుకుతుంది. 24K బంగారం తప్ప మిగతా అన్నిటిలో రాగి లేదా వెండి వంటి లోహాలు మిళితమై ఉంటాయి.

బంగారం స్వచ్ఛత ఎంత ఎక్కువగా ఉంటే దాని ధర అంత ఎక్కువగా ఉంటుంది. 24 క్యారెట్ బంగారం ధర ఎప్పుడూ పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడికి 24 క్యారెట్ల బంగారం మంచిది.

నగలు చేయించడానికి 24 క్యారెట్ల బంగారం పనికిరాదు. ఎందుకు స్వచ్ఛంగా ఉండడం వల్ల మెత్తగా ఉంటుంది. అందుచేత నికెల్, కాపర్, సిల్వర్ వంటి లోహాలు ఇందులో కలుపుతారు. ఆభరణాలు దృఢంగా ఉండడానికి ఇలా చేస్తారు.

Tags:    

Similar News