Twitter's Logo: అమ్మకానికి ట్విట్టర్ లోగో.. ఎంత ధర పలికిందో తెలుసా ?

Twitter's Logo: ట్విట్టర్ చాలా కాలంగా బ్లూ బర్డ్ తోనే గుర్తింపు పొందింది. కానీ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసుకున్నప్పటి నుంచి దానిలో ఒకదాని తర్వాత ఒకటి అనేక మార్పులు చేశారు.

Update: 2025-03-22 08:15 GMT
Twitters Iconic Blue Bird Logo Sold at Auction Guess How Much It Went For

Twitter's Logo: అమ్మకానికి ట్విట్టర్ లోగో.. ఎంత ధర పలికిందో తెలుసా ?

  • whatsapp icon

Twitter's Logo: ట్విట్టర్ చాలా కాలంగా బ్లూ బర్డ్ తోనే గుర్తింపు పొందింది. కానీ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసుకున్నప్పటి నుంచి దానిలో ఒకదాని తర్వాత ఒకటి అనేక మార్పులు చేశారు. మొదట దాని పేరును X గా మార్చారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో బ్లూ బర్డ్ తో ఉన్న ఐకానిక్ లోగో ఇప్పుడు వేలానికి వచ్చింది.

ఆ బ్లూ బర్డ్ 34 వేల 375 డాలర్లకు అంటే మన కరెన్సీలో దాదాపు 30 లక్షల రూపాయలకు వేలం పలికింది. వేలం సంస్థ పిఆర్ ఈ వార్తలను కన్ఫాం చేశారు. దాదాపు 254 కిలోల బరువు, 12 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు ఉన్న ఈ బ్లూ బర్డ్ లోగో కొనుగోలుదారుడి గుర్తింపును వెల్డించలేదు.

అయితే, ఆ బ్లూ బర్డ్ వేలం ప్రక్రియలో ఆపిల్-1 కంప్యూటర్ దాదాపు రూ.3.22 కోట్లకు (3.75 లక్షల డాలర్లు) అమ్ముడైంది. స్టీల్ జాబ్స్ సంతకం చేసిన ఆపిల్ చెక్కు దాదాపు రూ.96.3 లక్షలకు (1,12,054 డాలర్లు) అమ్ముడైంది. సీల్డ్ ప్యాక్ అయిన మొదటి తరం 4జీబీ ఐ ఫోన్ 87 వేల 514 డాలర్లకు అమ్ముడైంది. ఈ బ్లూ బర్డ్ లోగో ఇకపై మైక్రో-బ్లాగింగ్ వెబ్‌సైట్ Xలో భాగం కానప్పటికీ, దాని గుర్తింపు సోషల్ మీడియాలో Apple లేదా Nike లాగానే ఉంది.

2022 సంవత్సరంలో ఎలోన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌ను దాదాపు రూ.3368 బిలియన్లకు (44 బిలియన్ డాలర్లు) కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించడం గమనించదగ్గ విషయం. ఒప్పందం కుదిరిన తర్వాత ఆ సమయంలో ఎలోన్ మస్క్ ప్రజాస్వామ్యం సజావుగా సాగడానికి వాక్ స్వాతంత్య్రం అవసరమని అన్నారు. కొత్త ఫీచర్లు, మెరుగుదలలతో ట్విట్టర్ ఉత్పత్తి అత్యుత్తమ స్థలంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొంతమంది ప్రకటనదారులు తిరిగి వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో X పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అదనంగా, ఎలోన్ మస్క్ కొనుగోలు కోసం అతనికి 13 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చిన బ్యాంకు కూడా దీని నుంచి ఉపశమనం పొందింది.

Tags:    

Similar News