Gold Rate Today: ఏపీ, తెలంగాణలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today:
Gold Rate Today August 4, 2024 : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం ధరలు తగ్గడంతో సామాన్య ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తులం బంగారం రూ.4వేలు తగ్గింది. దీంతో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ తాజాగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. బంగారంపై దిగుమతి సుంకం తగ్గించిన తర్వాత తగ్గాలి కానీ విరుద్ధంగా పెరుగుతూ వస్తోంది. మరి నేడు ఆదివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,850 ఉంది. 24క్యారెట్ల పసిడి ధర రూ. 70,730 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64, 700గా ఉంది. 24, క్యారెట్ల బంగారం ధర రూ. 70, 580 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 64,500గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 70, 360 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,700, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70, 580 దగ్గర కొనసాగుతోంది.
ఇక ఏపీ, తెలంగాణలో చూస్తే..
ఏపీ, తెలంగాణల విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి దర రూ. 64, 700గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 70,580గా ట్రేడ్ అవుతోంది. విజయవాడలో 22క్యారెట్ల బంగారం ధరరూ. 64,700 ఉండగా..24 క్యారెట్ల పసిడి ధర రూ. 70,580 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక వెండి ధరలను చూసినట్లయితే
ఆదివారం వెండి ధర లో మార్పు కనిపించలేదు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, కోల్ కతా, పుణే వంటి నగరాల్లో కిలో వెంి దర రూ. 85, 500 వద్ద కొనసాగుతోంది. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 90,900 వద్ద కొనసాగుతోంది.