Gold Loan: ఈ టాప్‌ బ్యాంకులు తక్కువ వడ్డీకే గోల్డ్‌ లోన్‌ ఇస్తున్నాయి.. అవేంటంటే..?

Gold Loan: జీవితంలో కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరికి డబ్బు అత్యవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో సమయానికి డబ్బు లభించకుంటే చాలా అనర్థాలు జరుగుతాయి.

Update: 2024-02-10 12:00 GMT

Gold Loan: ఈ టాప్‌ బ్యాంకులు తక్కువ వడ్డీకే గోల్డ్‌ లోన్‌ ఇస్తున్నాయి.. అవేంటంటే..?

Gold Loan: జీవితంలో కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరికి డబ్బు అత్యవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో సమయానికి డబ్బు లభించకుంటే చాలా అనర్థాలు జరుగుతాయి. అలాగే నేటికాలంలో మనుషుల మధ్య ప్రేమ, అనురాగాలు ఏమీ ఉండడం లేదు. అన్నీ డబ్బు సంబంధాలుగా మారాయి. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు అత్యవసరమైతే దానికి ఒక చక్కటి పరిష్కారం గోల్డ్‌ లోన్‌ మాత్రమే.

మీ దగ్గర బంగారం ఉంటే మీకు సులువుగా తక్కువ వడ్డీకే లోన్‌ లభిస్తుంది. తర్వాత సులువైన ఈఎంఐ పద్దతిలో అప్పు తీర్చేసి మళ్లీ మీ బంగారం మీరు తీసుకోవచ్చు. అయితే ఈ లోన్‌ తీసుకునేటప్పుడు సంస్థలు వడ్డీ రేటు వసూలు చేస్తాయి. ఎక్కడ తక్కువ వడ్డీ ఉంది, ప్రాసెసింగ్‌ ఫీజు ఎంత తదితర విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్లాలి. ఈ రోజు తక్కువ వడ్డీకే గోల్డ్‌లోన్‌ అందించే కొన్ని బ్యాంకుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

ప్రైవేట్ సెక్టార్ లోహెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తక్కువ వడ్డీకే గోల్డ్‌ లోన్‌ అందిస్తోంది. ఇందులో 8.50 శాతం నుంచి 17.30 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ మొత్తం వివిధ కాలాలకు మారే అవకాశాలు ఉంటాయి.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45 శాతం నుంచి 8.55 శాతం వడ్డీకి గోల్డ్ లోన్ ఇస్తోంది. మీరు రూ.10,000 నుంచి రూ.40 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. మార్చి 31, 2024 వరకు గోల్డ్ లోన్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

UCO బ్యాంక్

UCO బ్యాంక్ వినియోగదారులకు సులువుగా గోల్డ్‌ లోన్‌ మంజూరు చేస్తుంది. ఈ బ్యాంకు కస్టమర్లకు 8.60 శాతం నుంచి 9.40 శాతం వరకు వడ్డీకి అందిస్తోంది. దీనితో పాటు మీరు రూ 250 నుంచి రూ 5000 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇండియన్ బ్యాంక్

ఇండియన్ బ్యాంక్ గురించి మాట్లాడితే 8.65 శాతం నుంచి 10.40 శాతం వరకు గోల్డ్‌లోన్‌పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్‌లోన్‌ ఇస్తుంది. వడ్డీ రేటు 8.70 శాతం నుంచి ప్రారంభమవుతుంది. మీరు రూ. 20,000 నుంచి రూ. 50 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. రూ. 3 లక్షల రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ రుసుము వసూలు చేయరు.

Tags:    

Similar News