Women Schemes: ఈ స్కీములు మహిళలకు సంబంధించినవి.. ఇన్వెస్ట్‌ చేస్తే అధిక రాబడులు..!

Women Schemes: ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ కార్పొరేట్‌ కంపెనీలు మహిళల కోసం కొత్త కొత్త స్కీంలను ప్రవేశపెడుతున్నాయి. వీటిలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మహిళలు పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు.

Update: 2024-03-12 12:30 GMT

Women Schemes: ఈ స్కీములు మహిళలకు సంబంధించినవి.. ఇన్వెస్ట్‌ చేస్తే అధిక రాబడులు..!

Women Schemes: ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ కార్పొరేట్‌ కంపెనీలు మహిళల కోసం కొత్త కొత్త స్కీంలను ప్రవేశపెడుతున్నాయి. వీటిలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మహిళలు పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. వీటిని కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఇందులో బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ చెల్లిస్తారు. మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించడానికి ఇవి బాగా ఉపయోగపడుతాయి. చిన్న మొత్తాలను భద్రంగా సేవ్‌ చేసుకోవచ్చు. అలాంటి కొన్ని స్కీమ్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మహిళా సమ్మాన్ సేవింగ్‌ స్కీం

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం ఒక ప్రత్యేక సేవింగ్‌ స్కీం. ఈ పథకానికి సంబంధించిన ఖాతాను పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా అధీకృత బ్యాంకులో తెరవవచ్చు. ఈ పథకంలో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. తర్వాత రూ. 100 గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.2 లక్షలు. దీని కింద ప్రతి సంవత్సరం 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. మొత్తం ఖాతాలో జమ చేస్తారు.

ఎల్‌ఐసీ ఆధార్‌ శీలా పాలసీ

ఎల్‌ఐసి ఆధార్‌ శీలా పాలసీ మహిళల కోసం ప్రవేశపెట్టారు. ఇది నాన్-లింక్డ్ వ్యక్తిగత జీవిత బీమా పథకం. దీని కింద పెట్టుబడిదారు మెచ్యూరిటీపై నిర్ణీత మొత్తాన్ని పొందుతాడు. పాలసీ పూర్తయ్యేలోపు ఇన్వెస్టర్ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ పాలసీ కింద కనీసం రూ. 75,000 ప్రాథమిక హామీ మొత్తంగా అందుబాటులో ఉంటుంది. హామీ ఇవ్వబడిన గరిష్ట మొత్తం రూ. 3 లక్షలుగా ఉంది. ఇందులో మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక చెల్లింపు ఆప్షన్స్‌ పొందుతారు. ప్లాన్‌లో మెచ్యూరిటీ కోసం పాలసీదారు గరిష్ట వయస్సు 70 ఏళ్లు మించకుండా ఉండటం ముఖ్యం.

పోస్ట్ ఆఫీస్ MIS పథకం

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) మహిళలకు ఉత్తమమైన పథకం అని చెప్పవచ్చు. ఈ పథకంలో నిర్ణీత మొత్తాన్ని ఒకసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా వడ్డీ రూపంలో సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితిని సింగిల్ ఖాతాకు రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు, జాయింట్ ఖాతాకు రూ.15 లక్షలకు పెంచారు. ఇక్కడ రూ.15 లక్షల పెట్టుబడిపై నెలవారీ వడ్డీ రూ.9,000 (రూ.8,875) ఆదాయం పొందుతారు. ఈ ఆదాయం ఉమ్మడి ఖాతాదారులందరికీ సమానంగా పంపిణీ చేస్తారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల తర్వాత వడ్డీ చెల్లిస్తారు. ఒకే ఖాతాలో రూ. 9 లక్షల పెట్టుబడిపై నెలవారీ వడ్డీ ఆదాయం రూ. 5,325 ఉంటుంది. ఉమ్మడి ఖాతాలో రూ. 15 లక్షల పెట్టుబడిపై నెలవారీ వడ్డీ ఆదాయం రూ. 8,875 వరకు ఉంటుంది.

Tags:    

Similar News