రైతులకి అలర్ట్‌.. 12వ విడత పొందడానికి ఇంకా అవకాశం ఉంది..!

ఇంత జరిగినా ఇంకా ఖాతాల్లో డబ్బులు చేరని రైతులు చాలా మంది ఉన్నారు.. అయితే వారందరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Update: 2022-10-29 06:21 GMT

రైతులకి అలర్ట్‌.. 12వ విడత పొందడానికి ఇంకా అవకాశం ఉంది..!

PM Kisan: పీఎం కిసాన్ 12వ విడతను ఆగస్టు 17న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ పథకం కింద రూ.16,000 కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేశారు. ఈసారి 8 కోట్ల మంది రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇంత జరిగినా ఇంకా ఖాతాల్లో డబ్బులు చేరని రైతులు చాలా మంది ఉన్నారు. అయితే వారందరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నవంబర్ 30 వరకు వారి ఖాతాలో డబ్బు జమ అవుతుంది. దీనికి ఏం చేయాలో తెలుసుకుందాం.

వాస్తవానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద తక్కువ భూమి ఉన్న రైతులకు, ఆర్థికంగా బలహీనమైన రైతులకు ఏడాదికి 6 వేల రూపాయలు ఇస్తుంది. వీటిని ప్రతి నాలుగు నెలలకు మూడు వాయిదాలలో చెల్లిస్తుంది. పీఎం మోడీ ఒక్కో విడతకి రూ.2000 చొప్పున విడుదల చేస్తున్నారు. కానీ ఒక్కోసారి రైతుల ఖాతాల్లో డబ్బులు చేరడం లేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాన్ని పొందడానికి కేంద్ర ప్రభుత్వం e-KYCని తప్పనిసరి చేసింది. చాలా మంది రైతులకు సమాచారం లేకపోవడంతో ఈ-కెవైసి చేయలేదు. దీంతో ఈసారి 12వ విడతలో దాదాపు 2.62 కోట్ల మంది రైతులు నష్టపోయారు. వారి ఖాతాలో ఇంకా 2000 రూపాయలు రాలేదు. అదే సమయంలో చాలా మంది రైతులు భూ ధృవీకరణ చేసుకోలేదు. దీంతో వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.మీరు pmkisan.gov.inని సందర్శించడం ద్వారా మీ స్టేటస్‌ని తనిఖీ చేయవచ్చు

అయితే కొంతమంది రైతులు ఈ-కెవైసి చేశారు. తర్వాత కూడా 12 వ విడత డబ్బు వారి ఖాతాలోకి రాలేదు. భూమికి సంబంధించిన వెరిఫికేషన్‌ పూర్తి చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆ రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి భూమిని సరిచూసుకోవాలి. అయితే ఈ-కెవైసి, ల్యాండ్ వెరిఫికేషన్ చేసిన కొందరు రైతులకి కూడా 12వ విడత రాలేదు. ఆ రైతులు నమోదు చేసేటప్పుడు తప్పు సమాచారం అందించారు. వీటన్నిటిని సరిచేస్తే కచ్చితంగా 12 విడత డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News