పాన్‌కార్డు అలర్ట్‌.. ఆలస్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

*పాన్‌కార్డు అలర్ట్‌.. ఆలస్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

Update: 2023-01-20 04:30 GMT

పాన్‌కార్డు అలర్ట్‌.. ఆలస్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

PAN card Holders: ఆదాయపు పన్ను శాఖ తరచుగా పాన్ కార్డ్‌కి సంబంధించిన కొత్త సమాచారాన్ని అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారు ఆలస్యం చేయవద్దని ఆదాయపు పన్ను శాఖ మరోసారి ట్వీట్ చేసింది. పాన్ కార్డ్ హోల్డర్లు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారు మార్చి 31, 2023లోగా పాన్‌, ఆధార్‌ లింక్‌ చేయాలని లేదంటే వారి పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా మారుతుందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది.

ఆదాయపు పన్ను శాఖ తన ట్వీట్‌లో "ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం మినహాయింపు వర్గంలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్లందరూ 31-03-2023 నాటికి తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. ఏప్రిల్ 1, 2023 ఆధార్‌తో లింక్ చేయని పాన్‌లు ఇన్‌యాక్టివ్‌గా మారతాయని తెలిపింది.ఇది అత్యవసర నోటీసు కాబట్టి ఆలస్యం చేయవద్దు ఈ రోజే లింక్ చేయండని సూచించింది.

ప్రస్తుతం పెనాల్టీ చెల్లించడం ద్వారా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ప్రజలను మార్చి 31, 2022లోగా పాన్ ఆధార్‌ని లింక్ చేయాలని కోరింది. అయితే దీని కోసం మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1, 2022 నుంచి మార్చి 2023 మధ్య పాన్ ఆధార్‌లను లింక్ చేసినందుకు రూ.1000 జరిమానా చెల్లించాలి. అయినప్పటికీ రెండింటినీ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ చెల్లదు రద్దు అవుతుంది.

Tags:    

Similar News