Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ ముగింపు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా వారం తొలి రోజున ప్రతికూల బాటన ట్రేడింగ్ ఆరంభించి నష్టాల్లో ముగించాయి.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా వారం తొలి రోజున ప్రతికూల బాటన ట్రేడింగ్ ఆరంభించి నష్టాల్లో ముగించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 86 పాయింట్ల మేర క్షీణించగా నిఫ్టీ 14,700 మార్కు ఎగువకు చేరాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు మేర కోల్పోయి 49,771 వద్దకు చేరగా నిఫ్టీ 7 పాయింట్ల మేర స్వల్ప నష్టంతో 14,736 వద్ద స్థిరపడ్డాయి. దేశీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ తదితర హెవీవెయిట్స్ పేలవ ప్రదర్శన, యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.