బుల్ రన్ : భారీ లాబాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

Update: 2021-02-24 12:14 GMT

బుల్ రన్ : భారీ లాబాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాబాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల లాభాన్ని నమోదు చేయగా నిఫ్టీ 15 వేల పాయింట్ల వద్దకు చేరింది. ఆరంభ ట్రేడింగ్ లోనే సెన్సెక్స్ 114 పాయింట్లు ఎగబాకగా నిఫ్టీ 14,750 పాయింట్ల వద్దకు చేరింది. అయితే జాతీయ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీలో తలెత్తిన సాంకేతిక లోపం ఫలితంగా దేశీ స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించారు. ఎన్ఎస్ఈ నిఫ్టీలో సాయంత్రం 3.45 గంటల నుంచి ట్రేడింగ్‌ తిరిగి ప్రారంభం కాగా నిఫ్టీతో పాటు సెన్సెక్స్‌ సమయాన్ని సైతం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1030 పాయింట్లు జంప్ చేసి 50,781 వద్దకు చేరగా, నిఫ్టీ 274 పాయింట్లు ఎగబాకి 14,982 వద్ద స్థిరపడ్డాయి.

Tags:    

Similar News