దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ సెన్సెక్స్ 130 పాయింట్ల మేర నష్టాలను నమోదు చేయగా, నిఫ్టీ తొలిసారిగా 14,500 పాయింట్ల వద్దకు చేరింది. తాజావారం తొలి సెషన్ ను భారీ లాభాలతో ముగించిన బెంచ్ మార్క్ సూచీలు మలి సెషన్ లో ఊగిసలాట ధోరణిలో పయనిస్తున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభం కాగా నిఫ్టీ సైతం 26 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏసియా మార్కెట్లు నష్టాలకు తోడు బ్యాంకింగ్ రంగ షేర్లు కుదేలు కావడం, అమ్మకాల ఒత్తిడి వంటి పరిణామాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.