Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టాయి.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజు బెంచ్‌మార్క్ సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 663 పాయింట్లు మేర కోల్పోగా నిఫ్టీ 14,700 మార్క్ దిగువన స్థిరపడ్డాయి. దేశీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 627 పాయింట్లు కోల్పోయి 49,509 వద్దకు చేరగా నిఫ్టీ 154 పాయింట్లు మేర నష్టంతో 14,690 వద్ద స్థిరపడ్డాయి.