Stock Market: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 127 డౌన్ ఫాల్

Update: 2023-07-07 07:58 GMT

Stock Market: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు 

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ దూకుడు కల్లెం పడినట్లు కనిపిస్తోంది. నిన్నటి వరకు దూసుకెళ్లిన సూచీలు వారాంతం ట్రేడింగ్‌ను స్వల్ప నష్టాలతో మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, మదుపర్లు లాభాల స్వీకరణ వంటి అంశాలు సూచీలను ప్రభావితం చేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 400 పాయింట్లు పతనమై 65,387 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు కుంగి 19,375 వద్ద ట్రేడవుతున్నాయి. జూబ్లియంట్‌ పార్మోవా, శోభా లిమిటెడ్‌, జెన్‌ టెక్నాలజీస్‌, వీగార్డ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. బోరోసిల్‌, మెడ్‌ప్లస్‌ హెల్త్‌, చోళమండల్‌ ఫినాన్స్‌, జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు విలువ తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు బలహీనపడి 82.68కు చేరింది.

నిన్నటి ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 339.60 పాయింట్ల లాభంతో 65వేల 785.64 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీకి ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నీన్న ఎస్‌ఎన్‌ఈ నిఫ్టీ సైతం 19 వేల 500 పాయింట్ల మైలురాయిని తచ్చాడింది. ఇంట్రాడేలో 114 పాయింట్లు పెరిగి 19వేల 512 పాయింట్లను తాకిన సూచీ చివరకు 99 పాయింట్లు అందుకొని 19వేల 497.30 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరుల సంపద 300 లక్షల కోట్లు అధిగమించింది.

ఇదే జోరు ఇవాళ కూడా కొనసాగుతుందని మదుపరులు భావించినా... మార్కెట్లు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, మదుపర్లు లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

మరోవైపు ఆసియా మార్కెట్లు మొత్తం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ సూచీ 1.45, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్‌ 0.31, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 0.72శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.47శాతం, తైవాన్‌కు చెందిన టీఎస్‌ఈసీ 0.40శాతం కుంగాయి. ఇక గురువారం నాటి ట్రేడింగ్‌లో అమెరికా సూచీలు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. డోజోన్స్‌ 1.07, నాస్‌డాక్‌ 0.82, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.79శాతం పతనమయ్యాయి.

Tags:    

Similar News