భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడ్రోజూల పాటు లాభాల బాటన దౌడు తీసిన దేశీయ స్టాక్ మార్కెట్లు తాజా సెషన్ లో యూ-టర్న్ తీసుకుని నష్టాల బాటన కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ వెరసి బెంచ్ మార్క్ సూచీలు ప్రధాన మద్దతుస్థాయిలకు దిగువన కదలాడాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 598 పాయింట్ల మేర నష్టంతో 50,846 వద్దకు చేరగా, నిఫ్టీ 164 పాయింట్లు క్షీణించి 15,080 వద్ద స్థిరపడ్డాయి.