దేశీయ స్టాక్ మార్కెట్లు మరో మారు భారీ నష్టాలను మూటగట్టాయి. అత్యధిక స్థాయిల వద్ద ఇన్వెస‍్టర్ల లాభాల స్వీకరణతో కీలక సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఫలితంగా బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 52వేల దిగువకు చేరగా, నిఫ్టీ 15,300 స్థాయిని కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్లు దిగజారి 51,703 వద్దకు చేరగా నిఫ్టీ 104 పాయింట్ల నష్టంతో 15,208 వద్ద స్థిరపడ్డాయి గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు భారీ నష్టాలను మిగిల్చాయి.