దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. తాజావారం తొలి సెషన్ లో భారీ లాభాల్లో దూసుకుపోయిన సూచీలు మలి సెషన్ లో ఫ్లాట్ గా ట్రేడవుతూ నష్టాలను మిగిల్చాయి. ఫలితంగా మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లయింది. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 15,400 పాయింట్ల మార్క్ ను అందుకోగలిగింది. అయితే మిడ్ సెషస్ సమయానికి ఆరంభ లాభాలు ఆవిరి కాగా బెంచ్ మార్క్ సూచీలు నష్టాల బాట పట్టాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 49 పాయింట్ల మేర నష్టంతో 52,104 వద్దకు చేరగా నిఫ్టీ సైతం 1.25 పాయింట్ల మేర క్షీణించి 15,313 వద్ద స్థిరపడ్డాయి.