దేశీయ స్టాక్ మార్కెట్లు ఆద్యంతం ఊగిసలాట మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 24 పాయింట్లు నష్టపోయి 49,492 వద్ద ముగియగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.40 పాయింట్ల లాభంతో 14,564 వద్ద స్థిరపడింది. అయితే ఆరంభ ట్రేడింగ్ లో సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి సెన్సెక్స్ 50 వేల మార్క్ ను దాటగా నిఫ్టీ 87 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల బాట పట్టాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 49,073 పాయింట్లకు దిగజారింది చివరకు కొద్దిమేర కోలుకుని 24 పాయింట్ల నష్టంతో ముగిసింది. మరో వైపు ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ 10 పైసల మేర లాభంతో 73.15 వద్ద స్థిరపడింది.