భారీ లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు..

Update: 2021-01-11 10:51 GMT

దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ సెన్సెక్స్‌ 49వేల వద్ద ఆల్‌టైం గరిష్టాన్ని తాకగా, నిఫ్టీ 14,400 పాయింట్ల ఎగువకు చేరింది. తాజావారం తొలి సెషన్ ను లాభాలతో ఆరంభించిన బెంచ్ మార్క్ సూచీలు చివరివరకూ అదే జోరును కొనసాగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 486 పాయింట్లు ఎగసి 49,269 వద్దకు చేరగా, నిఫ్టీ 137 పాయింట్లు జంప్ చేసి 14,484 వద్ద స్థిరపడ్డాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ సన్నాహక చర్యలు, కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు వంటి కీలక అంశాలు సానుకూల ప్రభావం చూపాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags:    

Similar News