దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందించాయి. రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడుగా సాగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 689 పాయింట్లు జంప్‌చేసి 48,782 వద్దకు చేరగా నిఫ్టీ సైతం 209 పాయింట్లు ఎగసి 14,347 వద్ద స్థిరపడ్డాయి. పది రోజుల వరుస ర్యాలీకి గత రెండు రోజుల్లో బ్రేక్ పడినప్పటికీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు జీడీపీపై తాజా అంచనాలు, కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటుకు బలాన్నిఇచ్చినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.