దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ లాభాల్లో ముగిశాయి. గత వారం ఫ్లాట్‌గా ట్రేడ్ అయిన సూచీలు తాజావారం తొలి సెషన్ లో భారీ లాభాల్లో దూసుకుపోయాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 52 వేల మార్కును అధిగమించి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 609 పాయింట్ల లాభంతో 52,154 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 15,314 వద్ద స్థిరపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు ఎఫ్‌ఐఐ పెట్టుబడుల వెల్లువ, రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ఠానికి చేరడం, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిలోకి రావడం వంటి సానుకూల సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును పెంచాయి.