ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటి వద్దకే బ్యాంకింగ్ స్టేట్ బ్యాంక్ అన్ని సేవలు

కరోనా వైరస్ ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని రంగాలను దెబ్బ కొట్టింది. అర్థిక రంగంపై కోవిడ్ పెను ప్ర‌భావం చూపింది.

Update: 2020-04-04 10:33 GMT

కరోనా వైరస్ ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని రంగాలను దెబ్బ కొట్టింది. అర్థిక రంగంపై కోవిడ్ పెను ప్ర‌భావం చూపింది. ఈ మ‌హమ్మారి దెబ్బ‌కు దేశం మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లడం కష్టంగా మారింది. అయితే అత్య‌వ‌స‌రం సమయంలో డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులు ఇంటి వద్దనే వచ్చి త‌మ‌ సర్వీసులు అందిస్తున్నాయి.దేశీ అతిపెద్ద ప్ర‌భుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కూడా త‌మ ఖాతాదారుల‌కు ప‌లుర‌కాల సేవ‌ల‌ను అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఆఫర్ చేస్తోంది. ఈ స‌ర్వీసుల్లో భాగంగా బ్యాంకింగ్‌లో క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, డ్రాఫ్ట్ డెలివరీ, ఫామ్ 15 హెచ్ పికప్, చెక్ పికప్, కేవైసీ డాక్యుమెంట్స్ పికప్, లైఫ్ సర్టిఫికెట్ పికప్ వంటి చాలా సర్వీసులు పొందొచ్చు.

ఈ సర్వీసుల పొందాలంటే కేవ‌లం ఒక్క ఫోన్ కాల్ సరిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వ‌ర‌కూ 1800111103 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఈ సదుపాయం పొందొచ్చు. కాగా డోర్ స్టెప్ సర్వీసులు పొందాలని అనుకునే వారు ముఖ్యంగా కొన్ని అంశ‌లు గుర్తుపెట్టుకోవాలి. బ్యాంకు అందిస్తున్న ఈ సర్వీసులు కేవలం సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు మాత్రమే. అలాగే హోమ బ్రాంచ్‌లో మాత్రమే ఈ సేవలు లభిస్తాయి. ఎస్‌బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల ప‌లు చార్జీలు వ‌సూలు చేస్తోంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు 60 రూపాయ‌లు చెల్లించుకోవాలి. అదే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు 100 రూపాయ‌లు చార్జీ పడుతుంది. ఈ చార్జీలకు జీఎస్‌టీ అదనం. 20 వేల రూపాయ‌లు రోజుకు ఒక ట్రాన్సాక్షన్ ద్వారా ఇంటి వద్దకే పొందొచ్చు.




Tags:    

Similar News