ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 44 కోట్ల మందికి ప్రయోజనం
ఎస్‌బీఐ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ. ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అన్ని రకాలసేవలను అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లోన్స్, ఇన్సూరెన్స్, హోమ్ లోన్ , నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వివిధ సేవలను అందిస్తోంది.
ఎస్‌బీఐ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ. ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అన్ని రకాలసేవలను అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లోన్స్, ఇన్సూరెన్స్, హోమ్ లోన్ , నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వివిధ సేవలను అందిస్తోంది. తాజాగా ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ అందిచింది.
గతంలో ఎస్‌బీఐ అకౌంట్ కలిగిన ఖాతాదారులు మినిమమ్ బ్యాలెన్స్ విధించింది. సేవింగ్స్ అకౌంట్లకు మెట్రో నగరాల్లో రూ.3,000, పట్టణాల్లో ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ రూ.2,000గా.. గ్రామీణ ప్రాంతాల్లోని అకౌంట్లకు రూ.1,000గా నిర్దేశించింది. అంతే కాకుండా కస్టమర్ల సేవింగ్స్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే రూ.5 నుంచి రూ.15 వరకు పెనాల్టీ, జీఎస్‌టీ చార్జీలు కూడా విధిస్తుంది.
కాగా.. తాజాగా ఎస్‌బీఐ తమ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. స్టేట్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపై మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు ఎత్తివేసింది. దీంతో 44.51 కోట్ల మంది ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది.
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలే కుకాండా ఎస్ఎంఎస్(SMS) చార్జీలను తొలగిస్తూ ప్రకటించింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్‌పై వడ్డీ రేటును 3 శాతానికి దీంతో ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమర్లకు మరింత ప్రయోజనం కలుగనుంది. ఎస్‌బీఐ బ్యాంక్ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ మాట్లాడుతూ.. తమ బ్యాంకు ఖాతాదారులకు ఎక్కువ ప్రయోజనం కలిగించాలనే ఉద్ధే్శ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.