దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు నష్టాలు

*అమ్మకాల ఒత్తిడితో బలహీన ధోరణిన సూచీలు.. *సెన్సెక్స్‌ 530 పాయింట్లకు పైగా పతనం .. *నిఫ్టీ 150 పాయింట్లకు దిగువన స్థిరం..

Update: 2021-01-28 11:16 GMT

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు పతనాన్ని నమోదు చేశాయి. అమ్మకాల ఒత్తిడితో బలహీనంగా ప్రారంభమైన సూచీలు.. అంతకంతకూ నష్టాల దిశగా పయనించాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలు కేంద్ర బడ్జెట్ చుట్టూ ఉన్న ఆందోళన, అనిశ్చితి పరిస్థితులు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికర అమ్మకందారులుగా మారడంతో పాటు మదుపర్ల లాభాల స్వీకరణ వెరసి మార్కెట్లను నష్టాల బాటన నడిపించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 535 పాయింట్లు దిగజారి 46,874 వద్ద, నిఫ్టీ 149 పాయింట్ల నష్టంతో 13,817 వద్ద స్థిరపడ్డాయి.


Tags:    

Similar News