దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట..

Update: 2020-10-30 12:30 GMT

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోమారు నష్టాలను మిగిల్చాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు కాగా అదే బాటన దేశీ స్టాక్ మార్కెట్లు పయనించాయి. ఆరంభ ట్రేడింగ్ లో మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమై లాభాల బాటన సాగాయి. కొత్త డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు కావడంతో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ లాభాలను నమోదు చేసింది. అయితే ఆరంభ లాభాలు ఆవిరి కాగా ,సూచీలు నష్టాల బాటన దూసుకుపోయాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్ల మేర క్షీణించి 39,614వద్దకు చేరగా, నిఫ్టీ 28 పాయింట్ల మేర నష్టంతో 11,642 వద్ద స్థిరపడ్డాయి.

Tags:    

Similar News