SCSS vs Senior Citizen FD: సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌, సీనియర్‌ సిటిజన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. ఈ రెండింటిలో ఏది బెస్ట్‌..!

SCSS vs Senior Citizen FD: సీనియర్‌ సిటిజన్స్‌ ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసినా వారికి వడ్డీ శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం వీరికోసం అనేక స్కీమ్‌లను ప్రవేశపెట్టింది.

Update: 2024-02-11 14:30 GMT

SCSS vs Senior Citizen FD: సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌, సీనియర్‌ సిటిజన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. ఈ రెండింటిలో ఏది బెస్ట్‌..!

SCSS vs Senior Citizen FD: సీనియర్‌ సిటిజన్స్‌ ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసినా వారికి వడ్డీ శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం వీరికోసం అనేక స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. ప్రైవేట్‌ సెక్టార్‌లోకూడా వీరికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. చాలామంది రిటైర్మెంట్‌ తర్వాత వచ్చిన డబ్బులను ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీ డబ్బులతో కాలం గడుపుతారు. అయితే ఇందులో చాలామంది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) లేదా సీనియర్ సిటిజన్ FDని ఎంచుకుంటారు. ఈ రెండింటిలో ఏది బెస్ట్‌ స్కీమ్‌ అనేది ఈ రోజు తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ SCSS

SCSS అనేది రిటైర్డ్‌ ఉద్యోగులకు బెస్ట్‌ స్కీం అని చెప్పాలి. ఇది 60 ఏళ్లు పైబడిన వారికి మంచి రాబడిని అందిస్తుంది. ఇందులో ఏకమొత్తంలో డబ్బును డిపాజిట్ చేయవచ్చు. SCSS, FD రెండింటిలోనూ లాక్-ఇన్ వ్యవధి సమానంగా ఉంటుంది. అయితే రెండింటి ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. సీనియర్‌ సిటిజన్‌ స్కీం ప్రభుత్వ మద్దతుతో నడిచే పథకం కాబట్టి సురక్షితమైన పెట్టుబడి పథకంగా చెప్పవచ్చు. ఇందులో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను రాయితీని పొందుతారు.

ఈ పొదుపు పథకం ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. మీరు కావాలను కుంటే మరో మూడేళ్లకు పొడిగించుకోవచ్చు. SCSS ఖాతాను తెరవడం చాలా సులభం. మీరు ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఈ ఖాతాను తెరవవచ్చు. అదేవిధంగా SCSS ఖాతాను దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్రాంచ్‌కైనా బదిలీ చేసుకోవచ్చు. ఈ పథకంలో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టాలి. దీన్ని రూ. 1,000 గుణిజాల్లో ఎంతైనా పెంచుకోవచ్చు. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

సీనియర్ సిటిజన్ ఎఫ్‌డి పథకం

సాధారణ ఎఫ్‌డితో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇస్తాయి. పెట్టుబడి దారులు వడ్డీ మొత్తాన్ని పొందడానికి వివిధ ఆప్షన్స్‌ ఎంచుకుంటారు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా ఉంటాయి. ప్రతి నెలా వడ్డీ తీసుకోవడం ద్వారా నెలవారీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కొన్ని FDలపై పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. వాటి మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

రెండింటి మధ్య వ్యత్యాసం

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై బ్యాంకులు 8.2 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. ఇది సెక్షన్ 80C కింద వర్తిస్తుంది. మీరు ఐదేళ్ల లోపు FDలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎలాంటి పన్ను ప్రయోజనం ఉండదు.రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే SCSS కింద గరిష్ట పెట్టుబడి పరిమితి ఉంటుంది. అయితే FDలో ఈ పరిమితి ఉండదు.

Tags:    

Similar News