Rooftop Solar Scheme: టెర్రస్‌పై సోలార్‌ ప్యానెల్స్‌ ప్లాన్‌ చేస్తున్నారా.. ఈ స్కీం కింద లోన్‌ అప్లై చేయవచ్చు..!

Rooftop Solar Scheme: ఈ రోజుల్లో చాలా కుటుంబాలు అధిక విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక ఇబ్బందిపడుతున్నారు.

Update: 2024-02-17 12:30 GMT

Rooftop Solar Scheme: టెర్రస్‌పై సోలార్‌ ప్యానెల్స్‌ ప్లాన్‌ చేస్తున్నారా.. ఈ స్కీం కింద లోన్‌ అప్లై చేయవచ్చు..!

Rooftop Solar Scheme: ఈ రోజుల్లో చాలా కుటుంబాలు అధిక విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక ఇబ్బందిపడుతున్నారు. ఇక అద్దెకున్నవాళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఒకప్పుడు వంద, నూటయాభై వచ్చే బిల్లు ఇప్పుడు వేలల్లో వస్తుంది. దీంతో చాలామంది తట్టుకోలేకపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కరించడానికే ప్రధాని మోదీ ప్రభుత్వం దేశంలో దేశంలో సౌరశక్తిని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఇటీవల 1 కోటి ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చే కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం బ్యాంకుల నుంచి లోన్లు కూడా ఇప్పిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ స్కీమ్‌కు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఇటీవల బ్యాంకులతో సమావేశం నిర్వహించాయి. ఇప్పుడు గృహ రుణంతో పాటు, ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడానికి బ్యాంకులు ఆర్థిక సాయం అందించాలని సమావేశంలో నిర్ణయించారు. దీని కోసం గృహ రుణంతో పాటు సోలార్ ప్యానెల్స్ క్లబ్ చేసి బ్యాంకులు ఫైనాన్స్ అందిస్తాయి. ఇది కాకుండా బ్యాంకులు సోలార్ ప్యానెల్‌ల కోసం ప్రత్యేక పథకాన్ని కూడా తీసుకువస్తాయి లేదంటే అందుబాటులో ఉన్న స్కీంలలో కొన్ని మార్పులు చేస్తాయి.

నేషనల్ సోలార్ పోర్టల్‌తో లింక్ చేయండి

ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని కింద రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లకు ఫైనాన్సింగ్ చేయడంపై దృష్టి పెట్టాలని బ్యాంకులను కోరింది. రూఫ్‌టాప్ సోలార్ కోసం నేషనల్ పోర్టల్‌తో బ్యాంకులను అనుసంధానించాలని నిర్ణయించారు. తద్వారా కస్టమర్‌లతో సహా సంబంధిత పార్టీలందరూ రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందుతారు.

సంపాదించే అవకాశం

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ పథకం సాయంతో ప్రజలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని పొందుతారు. దీని వల్ల విద్యుత్ బిల్లులపై వేల రూపాయలు ఆదా అవుతాయన్నారు. ఈ పథకం కింద కస్టమర్లు అదనపు విద్యుత్‌ను విక్రయించగలరు. ఇది వారికి అదనపు ఆదాయాన్ని సంపాదిస్తుంది.

Tags:    

Similar News