Rented House vs Owned House: అద్దె ఇల్లు బెటరా.. సొంతిల్లు బెటరా.. ఆర్థికంగా ఏది ప్రయోజనం చేకూరుస్తుంది..!

Rented House vs Owned House: అద్దె ఇల్లు బెటరా, సొంతిల్లు బెటరా అంటే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో పడుతారు.

Update: 2024-05-24 16:30 GMT

Rented House vs Owned House: అద్దె ఇల్లు బెటరా.. సొంతిల్లు బెటరా.. ఆర్థికంగా ఏది ప్రయోజనం చేకూరుస్తుంది..!

Rented House vs Owned House: అద్దె ఇల్లు బెటరా, సొంతిల్లు బెటరా అంటే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో పడుతారు. ఎందుకంటే కొంతమంది తమ జీవితం మొత్తం సొంతిల్లు నిర్మించు కోవడానికి లేదా కొనడానికి ప్రయత్నిస్తారు. అదే లక్ష్యంగా జీవిస్తారు. మరి కొంతమంది జీవితాంతం ఉద్యోగం చేస్తూ ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితుల్లో అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తూ ఉంటారు. అయితే ఇల్లు కట్టుకోవడం, కొనడం ఆర్థికంగా చాలా కష్టమైన పని కానీ అద్దె ఇంట్లో ఉండడం పెద్ద భారంగా అనిపించదు. దీర్ఘకాలికంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్‌ అనే దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సొంతిల్లు అనేది చాలా మందికి ఉండే ఒక కల. ఇది మీకు యాజమాన్యాన్ని ఇవ్వడంతో పాటు స్థిరత్వం, ధైర్యాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అద్దెదారుల మాదిరి కాకుండా, సొంతిల్లు ఉంటే తమ నివాస స్థలంపై నియంత్రణ కలిగి ఉంటారు. స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తిని పొందుతారు. ఇల్లు అద్దెకు తీసుకుంటే తక్షణ సౌలభ్యాన్ని అందిస్తుంది. మారుతున్న పరిస్థితుల కు అనుగుణంగా వ్యక్తులు అలవాటు పడటానికి వీలు కల్పిస్తుంది. మీకు నచ్చిన ఇంట్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు మారినప్పుడు సులువుగా ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. ఆర్థికంగా కూడా పెద్దగా బారం ఉండదు. వచ్చే జీతంలో ఎక్కువ శాతం పొదుపు చేయవచ్చు. మీ లక్ష్యాలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది.

అయితే సొంతిల్లు ఉంటే దీర్ఘకాలికంగా వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. ఎందుకంటే ఆస్తి విలువ సాధారణంగా కాలక్రమేణా పెరుగుతుంది. రెంట్‌ ఇల్లుతో పోలిస్తే హౌసింగ్ ఖర్చులు తక్కువగా ఉంటాయి. మీకు ఆర్థికంగా భరోసా ఉంటుంది. అవసరమైతే ఇంటిని తనఖా పెట్టి బ్యాంకులో లోన్‌ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఒకే దగ్గర స్థిరంగా ఉంటాం అనుకునే వారు సొంతిల్లు కట్టుకోవడం, కొనడం లాభదాయకంగా ఉంటుంది. భవిష్యత్ తరాలకు వారసత్వాన్ని ఇవ్వొచ్చు. మానసికంగా ప్రశాంతతని పొందుతారు.

Tags:    

Similar News