Reliance: రిలయన్స్ సరికొత్త హెల్త్ ఇన్సూరెన్స్.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా చికిత్స పొందవచ్చు..!
Reliance: ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. లేదంటే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు.
Reliance: ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. లేదంటే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. సమయానికి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అప్పుడు ఈ హెల్త్ పాలసీయే మనల్ని కాపాడుతుంది. అయితే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారతీయ కస్టమర్ల కోసం ‘రిలయన్స్ హెల్త్ గ్లోబల్’ పాలసీని ప్రారంభించింది. దీని సాయంతో భారతీయులు ప్రపంచ స్థాయి ఆరోగ్య సౌకర్యాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ పాలసీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సమగ్రమైన ఆరోగ్య రక్షణను అందిస్తుంది.
క్యాన్సర్ లేదా బైపాస్ సర్జరీ ఖర్చు కవర్ అవుతుంది
ఈ ఆరోగ్య బీమా కింద ప్రజలు క్యాన్సర్, బైపాస్ సర్జరీ వంటి తీవ్రమైన వ్యాధులకి చికిత్స పొందుతారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇలాంటి వ్యాధి వస్తే దాని చికిత్సకు అయ్యే ఖర్చు ఈ బీమా పరిధిలోకి వస్తుంది.
8.3 కోట్ల వరకు కవర్ ఆప్షన్
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకారం 'హెల్త్ గ్లోబల్' పాలసీలో కస్టమర్లు 1 మిలియన్ డాలర్ల వరకు కవర్ పొందవచ్చు. రూపాయి లెక్కన చూస్తే ఈ మొత్తం రూ.8.30 కోట్లు. బీమా మొత్తంతో పాటు విదేశాల్లో వసతి, ప్రయాణం, వీసాకు సంబంధించిన సహాయం ఈ పాలసీలో భాగంగా ఉంటుంది.
ఎయిర్ అంబులెన్స్ నుంచి అవయవ దానం వరకు
ఈ పాలసీలో మీరు చికిత్స కోసం ఒక ప్రైవేట్ గదిని బుక్ చేసుకోవచ్చు. గది అద్దెపై ఎటువంటి నిర్ణీత పరిమితి లేదు. వినియోగదారులు ఎయిర్ అంబులెన్స్, అవయవ దాత నుంచి అవయవ సేకరణపై అయ్యే ఖర్చులపై కూడా బీమా రక్షణ పొందుతారు. చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు. ఈ పరిస్థితిలో వారు ఈ పాలసీ నుంచి మెరుగైన ఆరోగ్య రక్షణ పొందవచ్చు.