కస్టమర్లకు జియో షాక్.. మళ్లీ చార్జీల పెంపు

Update: 2019-11-20 11:12 GMT

నిన్న, మెన్నటివరకూ టెలికం కంపెనీలు ఇచ్చిన ఆఫర్లలో కస్టమర్లు మునిగిపాయారు. కానీ ఇప్పుడు అవే టెలికాం కంపెనీలు ఆ ఆఫర్లను తీసేస్తూ కస్టమర్ లకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ మార్కెట్ లో నడిచిన టారిఫ్లను ఒక్క సారిగా పెంచుతున్నాయి. ముందుగా టారిఫ్ లను పెంచుతామని ప్రకటించిన టెలికం కంపెనీలలో వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌టెల్ ఉన్నాయి.

ఇప్పుడు వీటి బాటలోనే ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో కూడా నడుస్తుంది. రానున్న రోజుల్లో టారిఫ్ ధరలు పెంచుతామని ప్రకటించింది. ఎంత మేర టారిఫ్‌ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. నెట్‌వర్క్ విస్తరణ, టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్లే టారిఫ్ పెంపునకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. మిగిలిన టెలికం కంపెనీలు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ పెంపు ప్రకటన చేసిన తరువాతనే వారూ ఈ ప్రకటన చేశామని జియో సంస్థ స్పష్టం చేసింది.

ఏదైతేనేం కస్టమర్లకు మాత్రం ఈ టారిఫ్ లు పెరగడంతో ఒక్క సారిగా షాక్ తింటున్నారు. ఇంకా ఏయే టెలికాం పంపెనీలు టారీఫ్ లను పెంచుతాయో వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News