2008 నాటి రెసిషన్ మళ్లీ వస్తుందా? అందుకు ఇదే సంకేతమా?

Update: 2025-03-20 09:00 GMT
Recession fears in US growing more and more as pending car loans EMIs cases reminds of 2008 financial crisis in US

అమెరికాలో 2008 నాటి ఆర్థికమాంద్యం మళ్లీ రానుందా? అందుకు ఇదే సంకేతమా?

  • whatsapp icon

Recession fears in US: అమెరికాలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు చూస్తోంటే, 2008 నాటి ఆర్థిక మాంద్యం మళ్లీ రానుందా అనే భయాందోళనలకు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో లోన్స్ తీసుకున్న వారు ఇటీవల కాలంలో వాటిని చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంన్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ లోన్స్ తీసుకున్న వారిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఫిచ్ రేటింగ్స్ డేటాను విశ్లేషిస్తే... తక్కువ క్రెడిట్ స్కోర్‌తో సబ్ ప్రైమ్ ఆటో లోన్స్ తీసుకున్న వారిలో 6.6 శాతం రుణగ్రహీతలు ఆ లోన్స్‌ను తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐ చెల్లించాల్సిన డ్యూడేట్ కంటే కనీసం 60 రోజులు వెనుకబడి ఉన్నారని డైలీ మెయిల్ వార్తా కథనం పేర్కొంది.

అమెరికన్ మీడియా వార్తా కథనం ప్రకారం 2008 లో ఆర్ధిక మాంద్యం వచ్చినప్పుడు అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పట్లో కూడా సబ్‌ప్రైమ్ మార్ట్‌గేజ్ లోన్స్ తీసుకున్న వారు చాలామంది డీఫాల్టర్స్‌లా మిగిలిపోయారు. దీంతో ఈ ట్రెండ్ చూస్తోంటే అమెరికాలో మరోసారి 2008 నాటి రెసిషన్ హిస్టరీ రిపీట్ అవుతుందా అని అక్కడి బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే చాలామంది రుణగ్రహీతలు లోన్ ఇఎంఐలు చెల్లించకుండా ఆ డబ్బుతో రోజువారి కనీస అవసరాలు, తప్పనిసరి చెల్లింపులు మాత్రమే చెల్లిస్తూ ఇఎంఐలను వాయిదా వేస్తున్నారు.

ఈ పరిస్థితికి కారణమేంటి?

అమెరికా ప్రజలపై రాన్రాను ఆర్థిక భారం పెరిగిపోతోందని, అన్ని ధరలు పెరుగుతుండటంతో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇంటి అద్దెలు, నిత్యావసరాల ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి, ఆటోమొబైల్ లోన్స్ సెక్షన్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించడానికి కారణం ఏంటంటే... కార్ల ధరలు, ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జీలు, వాహనాల మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగాయని ఆ నివేదిక స్పష్టంచేసింది.

అమెరికా ప్రస్తుతం కెనడా, మెక్సికో దేశాలతో ట్రేడ్ వార్‌కు దిగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో అమెరికాలో కార్ల ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆయా దేశాలపై విధిస్తానన్న 25 శాతం దిగుమతి సుంకం అమలులోకి వచ్చినట్లయితే... అమెరికాలో కొత్త కార్ల ధరలు 4000 డాలర్ల నుండి 10,000 డాలర్ల వరకు పెరిగే ప్రమాదం ఉందని ఆండర్సన్ ఎకనమిక్ గ్రూప్ అంచనా వేస్తోంది.

అమెరికాలో కొత్త కారుకు ఎంత, పాత కారుకు ఎంత?

అమెరికాలో ఇటీవల కాలంలో కార్ల ధరలు భారీగా పెరిగాయి. అమెరికాలో కొత్త కారు సగటు ధర 47000 డాలర్లుగా ఉంది. అలాగే సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు 25,000 డాలర్ల వరకు ఉన్నాయని డైలీ మెయిల్ వార్తా కథనం వెల్లడించింది. కొత్త కారుపై లోన్ తీసుకుంటే 9 శాతం వరకు వడ్డీ రేటు చార్జ్ చేస్తున్నారు. పాత కార్లపై రుణాలు తీసుకుంటే బ్యాంకులు 14 శాతం వరకు వడ్డీ రేట్ చార్జ్ చేస్తున్నాయి.

తడిసి మోపెడవుతున్న ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్

కేవలం కార్ల ధరలు పెరగడం వల్లో లేక వడ్డీ రేట్లు పెరగడం వల్ల మాత్రమే వారిపై ఆర్థిక భారం పెరిగిందనడానికి వీల్లేదు. ఎందుకంటే, ఏ ఏడాదికి ఆ ఏడాది కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జీలు 19 శాతం పెరుగుతున్నాయి. ఇక కార్ల మెయింటెనెన్స్ విషయానికొస్తే... 2020 కి ముందుతో పోల్చుకుంటే ఆ తరువాత కార్ల మెయింటెనెన్స్ 33 శాతం పెరిగిందని ఆ నివేదిక స్పష్టంచేసింది. అందుకే కార్లకు ఈఎంఐలు చెల్లించడానికి ఆటోమొబైల్ లోన్స్ కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారని ఆ నివేదిక అభిప్రాయపడింది.

ఇవన్నీ చూస్తోంటే అమెరికాలో 2008 నాటి రెసిషన్ మళ్లీ వస్తుందా అనే భయం కనిపిస్తోంది. ఒకవేళ అమెరికాలో రెసిషన్ వస్తే... ఆ ప్రభావం భారత్‌పై కూడా పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే భారత ఐటి పరిశ్రమ అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.  

Gold Rate: రూ. 64 నుంచి 90,000 దాకా బంగారం ధర ఎలా పెరిగింది? ఇంకెంత పెరుగుతుంది?

Full View

More interesting stories: ఆసక్తికరమైన మరిన్ని వార్తా కథనాలు

కెనడా వచ్చి తప్పు చేశాను... పెద్ద చర్చకు దారితీసిన సోషల్ మీడియా పోస్ట్

సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు

లక్షన్నర జీతం వస్తున్నా సరిపోవడం లేదంటున్న టెకీ... జనం రియాక్షన్ చూడండి

Tags:    

Similar News