RBI Interest Rates: వడ్డీ రేట్లపై RBI కీలక ప్రకటన
RBI Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది.
RBI Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. వడ్డీ రేట్లను వరుసగా 8వసారి యథాతంగా ఉంచుతున్నట్ట ప్రకటించింది ఆర్బీఐ. ఈ మేరకు.. మొనేటరీ పాలసీ సమావేశం ముగింపు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణమే కొంత వరకు ఆందోళన కలిగిస్తోందని శక్తికాంత్ దాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.